మూడు వారాల క్రితం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి కరోనా పాజిటివ్ వచ్చినదని అందరికి తెలుసు, కానీ ఇప్పుడు ఆ కరోనా నుంచి ఆయన కోలుకున్నారు. RT-PCR పరీక్ష చేయించగా నెగటివ్ వచ్చిందని జనసేన పార్టీ నుండి ఒక ప్రకటన విడుదల అయ్యింది.

పవన్‌కు పాక్షిక లక్షణాలు ఉన్నాయని, మరో రెండు రోజుల బెడ్ రెస్ట్ అవసరమని ఆ ప్రకటన పేర్కొంది.పవన్ కళ్యాణ్ గారికి అపోలో వైద్య బృందం చికిత్స అందిస్తున్నారు, ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు మరియు పరిస్థితి పూర్తిగా స్థిరంగా ఉంది.

ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్న ప్రతీ జనసేన మద్దతుదారులందరికీ పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో కరోనా వినాశనం సృష్టిస్తోందని, అందువల్ల ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్గదర్శకాలను పాటించాలని, వైరస్ వ్యాప్తిని ఆపడానికి తమ వంతు సహాయం చేయాలని జనసేన అధినేత ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

x