మనం పవన్ కళ్యాణ్ గారి పిల్లలు అకిరా నందన్ మరియు అధ్య లను అరుదుగా చూస్తుంటాము. ఇద్దరు పిల్లలు తమ తల్లి రేణు దేశాయ్‌తో కలిసి నివసిస్తున్నారు. వారు ఎక్కువగా కెమెరా ముందు కనిపించరు. కనీసం, పవన్ కళ్యాణ్ అభిమానులు అకిరాను మెగా ఫ్యామిలీ ఫంక్షన్లలో చూశారు. కానీ అధ్యా మాత్రం ఎప్పుడూ కెమెరా ముందుకు రాలేదు.

చిన్న మెగా యువరాణి అధ్య ఇప్పుడు ఒక టెలివిజన్ షో ద్వారా మొట్టమొదటి సారిగా మనముందుకు వస్తుంది. జీ తెలుగులో ప్రసారం అవుతున్న షో డ్రామా జూనియర్స్ కు ఆమె ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ షో లో రేణు దేశాయ్ ఒక జడ్జి గా ఉన్నారు.

అధ్యా నటించిన ప్రోమోను ఈ ఉదయం ప్రసార ఛానల్ విడుదల చేసింది. షోలో అధ్య ని చూసి రేణు ఆనందంతో ఆశ్చర్యపోయారు. అభిమానులు ఇప్పుడు ఈ షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎపిసోడ్ మే 9 న రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Zee Telugu (@zeetelugu)

x