మ్యాచ్ హైలైట్స్:

పంజాబ్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ గెలిచింది. మొదట పంజాబ్ బౌలర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ముంబై జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. పంజాబ్ కింగ్స్ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఏమాత్రం తడబడకుండా 17.4 ఓవర్లలోనే స్కోర్ ను చేధించి, 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఫస్ట్ ఇన్నింగ్స్:

ఈరోజు మ్యాచ్ హైలెట్స్ విషయానికి వస్తే మొదట టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు ఫీల్డింగ్ ను ఎంచుకుంది. బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు ఓపెనర్ డికాక్ వికెట్ మొదట్లోనే కోల్పోయింది. అతని వెనక ఇషాన్ కిషన్ కూడా ప్రేవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ మాత్రం నిలబడి సూర్యకుమార్ యాదవ్ తో కలిసి మూడో వికెట్ కు 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

జట్టు స్కోరు 105 పరుగుల వద్ద ఉండగా సూర్య కుమార్ యాదవ్ 27 బంతుల్లో 33 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. ఆ మరుసటి ఓవర్లోనే రోహిత్ శర్మ కూడా 52 బంతుల్లో 63 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక మిగిలిన ముంబై బ్యాట్స్మెన్ ఎవరు చెప్పుకోదగ్గ స్కోర్స్ చేయలేడు. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేసింది. పంజాబీ కింగ్స్ లో మహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్ రెండు వికెట్ల చొప్పున తీయగా, దీపక్ హోదా, అర్షదీప్ సింగ్ చెరొక వికెట్ తీశారు.

సెకండ్ ఇన్నింగ్స్:

ముంబై ఇచ్చిన 131 పరుగుల లక్ష్యాన్ని సాధించుటకు బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు కె ల్ రాహుల్ మరియు మయాంక్ అగర్వాల్ అద్భుతంగా ప్రారంభించారు. మొదటి వికెట్ కు వీరిద్దరు 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత మయాంక్ అగర్వాల్ అవుటయ్యాడు. మయాంక్ అగర్వాల్ 20 బంతుల్లో 25 పరుగులు చేశాడు. తర్వాత దిగిన క్రిస్ గేల్ తో కలిసి కె ల్ రాహుల్ మ్యాచ్ను ముగించేశాడు. ఇదే క్రమంలో రాహుల్ తన అర్థసెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. మ్యాచ్ ముగిసే సమయానికి రాహుల్ 52 బంతుల్లో 60 పరుగుల తోను, క్రిస్ గేల్ 35 బంతుల్లో 43 పరుగుల తో నాటౌట్గా నిలిచారు. ముంబై బౌలర్లు లో రాహుల్ చాహర్ కి మాత్రమే ఒక వికెట్ దక్కింది.

x