ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగటమే. గత సంవత్సరం దేశంలో రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి. దీంతో సామాన్యులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ఈ ఏడాది ఆరంభం ముడి చమురు ధరలకు రెక్కలు వచ్చాయి.

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు రెండు శాతానికి పైగా పెరిగి 90 డాలర్ల ఎగువకు చేరింది. బ్రెంట్ చమురు ధర ఈ స్థాయికి చేరడం 2014 తర్వాత ఇదే తొలిసారి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర గత ఏడాది డిసెంబర్ 1 నాటికీ బ్యారెల్ 69 డాలర్లు గా ఉండగా.. ఈ మధ్య దాని ధర 88.38 డాలర్లకు పెరిగింది. మరికొన్ని రోజుల్లో దీని ధర 100 డాలర్లకు చేరుకోవచ్చని అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

దీనికి కారణం, రష్యా యూఏఈ మధ్య భౌగోళిక ఉద్రిక్తత దీని వల్ల అంతర్జాతీయ చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇది సరిపోదు అన్నట్లు ఇరాక్ నుంచి టర్కీ వెళ్లే ఓ ఇంధన పైప్ లైన్ లో సమస్యలు రావడంతో చమురు సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రస్తుతం ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఆకాశాన్ని అంటుతున్నాయి.

x