Pogaru Movie Review in Telugu
యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు కన్నడ చిత్ర సీమలోని యాక్టర్లలో ఒకరైన ధృవ సర్జ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం పొగరు. హైటెక్ ఆక్షన్ ప్రిన్స్ గా పేరుపొందిన ధృవ సరసున కథానాయికగా రష్మిక మందన్న నటిస్తుంది. ఇక ఫ్యాన్ ఇండియా ఫిలింగా తయారవుతున్న పొగరు మూవీకి నంద కిషోర్ దర్శకత్వం వహించారు.
ఇక ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది, మరి ఈ మూవీ ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో ఓసారి చూద్దాం.
ఇక కథ విషయానికి వస్తే, శివ (ధృవ సర్జ) చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోతాడు. ఆ తర్వాత అతనికి తెలియనివ్వకుండా అతని తల్లి అయినా పవిత్ర లోకేష్ మరో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెద్దయ్యాక ఈ విషయం తెలిసి శివ పూర్తిగా మారిపోతాడు. మొరటోడిగా మారతాడు. అలంటి వ్యక్తి తన కాలనీలో ఉన్న టీచర్ రష్మికాతో ప్రేమలో పడతాడు. ఆమె వల్ల ఇతని జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి?
అలాగే అతని సవితి చెల్లి వల్ల శివ ఎలా మారాడు? చివరికి అతడు ఆమె తల్లికి దగ్గర అయ్యాడా లేదా? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే.
Pogaru Movie Plus Points
ధృవ గత సినిమాలకు భిన్నంగా ఈ ఆక్షన్ డ్రామా సాగింది. ఇక ధృవ లుక్స్ యాక్షన్లో ఫ్రెష్ నెస్ ఉన్న ఫీలింగ్ కలిగింది. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ధృవ నటన సినిమాకే హైలైట్ గా కనిపిస్తుంది. ధృవ, రష్మిక మధ్య నడిచే ప్రేమ సన్నివేశాలు, వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే ఆకట్టుకుంది.
ఇక దర్శకుడు రాసుకున్న ట్రీట్మెంట్, హీరో గురించి రివీల్ చేసే ఎలేవేషన్ సీన్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా కొన్ని కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. సంపత్ తో కలిపి మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర మేరకు బాగానే నటించారు.
మొత్తం మీద ఫాస్ట్ అఫ్ ఎంటర్టైన్మెంట్ తో మధ్యమధ్యలో హీరో పాత్రకు సంబందించి క్యూరియాసిటీతో సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్ కు ముందు కథ కొంచెం వేగంగా సాగుతూ, సెకండ్ హాఫ్ మీద కాస్త ఇంటరెస్ట్ పెంచుతుంది.
సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించినా, ఎమోషన్ సన్నివేశాల్లో దర్శకుడు హార్డ్ వర్క్ కనిపిస్తుంది.
Pogaru Movie Minus Points
సినిమాలో కథనం తప్ప పెద్ద కథ లేదు, ఈ సినిమా కూడా రెగ్యులర్ మాస్ మసాలా సన్నివేశాలతో సాగుతుంది. ప్రధానంగా ఈ మూవీలో ప్రస్తావించిన కొన్ని అంశాలు ఇప్పుడు ఈ సమాజంలో ఎంతవరకు ఉన్నాయో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది.
ఈ సినిమాలో చూపించినట్టు ఇంత దారుణమైన పరిస్థితులు
బయట నిజజీవితంలో మనకి ఎక్కడా కనపడవు. ఇక సెకండ్ హాఫ్ లో హీరో ఫ్లాష్ బ్యాక్ కొంచెం స్టైలిష్ మేకింగ్ తో రిచ్ గా ఉన్నప్పటికీ, సన్నివేశాలు ఎప్పటి లాగే రొటీన్ గానే ఉన్నాయి.
సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ ఉన్న ల్యాగ్ సీన్స్ లాజిక్ లేకుండా విసుగు తెప్పిస్తాయి. హీరో తన సమస్యల గురించి అలోచించి, దాని కోసం హీరో చేసే పనులు మరి సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఇకపైగా ఫస్ట్ హాఫ్ ఉన్నంత స్పీడ్ గా, ఎంటర్టైన్మెంట్ గా సెకండ్ హాఫ్ ఉండదు.
హీరోయిన్ రష్మిక, హీరోని ప్రేమించడానికి, హీరోతో సాంగ్స్ లో డాన్స్ చేయడానికి తప్ప తన పాత్ర వల్ల కథకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అంత పల్సివ్ గా ఆమె పాత్రను డైరెక్టర్ డిజైన్ చేసాడు.
Technical
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే, దర్శకుడు కమర్షియల్ అంశాలకి, సామాజిక అంశాలు కలిపి ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడు. అయిన్నప్పటికీ ఇది చివరికి రెగ్యులర్ కమర్షియల్ ఫీలింగే వస్తుంది.
పాటలు పర్వాలేదనిపించాయి, సినిమాటోగ్రఫీ పనితనం ఈ సినిమాకు ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా తీశారు. సినిమాలోనే నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే ఈ మూవీ పక్కా మాస్ యాక్షన్ డ్రామాగా సాగుతూ, రొటీన్ కమర్షియల్ సినిమాలా ముగుస్తుంది.
ధృవ లుక్స్, ఆయన నటన, కొన్ని హాస్య సన్నివేశాలు, క్లైమాక్స్ సన్నివేశంలో ఎమోషన్ తప్ప ఈ మూవీలో ఇక చెప్పుకోడానికి ఏమి ఉన్నట్టు అనిపించదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగదీయకుండా ప్రేమకథలో ఇంకాస్త డెప్త్ పెంచి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
మొత్తం మీద ఈ చిత్రం పక్కా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది.
Pogaru Movie Rating
పొగరు మూవీ రేటింగ్ 3/5