ఏప్రిల్ నెల చివరి వారంలో కరోనా పాజిటివ్‌ వచ్చిన పూజా హెగ్డే పూర్తిగా కోలుకున్నారు. తాను మరల టెస్ట్ చేయించుకుంటే తనకు నెగెటివ్‌ వచ్చిందని ఆమె తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన తన అభిమానులకు, అనుచరులకు మరియు శ్రేయోభిలాషులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఆమె మాట్లాడుతూ “మీరు నా పైన చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. నేను బాగా కోలుకున్నాను, చివరకు టెస్ట్ చేయించుకుంటే నెగటివ్ వచ్చింది! అవును! మీ ప్రార్ధనలు మరియు వైద్యం అంతా ఇంద్రజాలం చేసినట్లు అనిపించింది. అందరు సురక్షితంగా ఉండండి ” అంటూ ట్విట్ చేసింది.

పూజ ఇప్పుడు పని చేయడానికి సిద్ధంగా ఉంది. ఆమె ప్రభాస్ తో కలిసి తీస్తున్న సినిమా రాధే శ్యామ్ చివరి షెడ్యూల్ పెండింగ్‌లో ఉంది, ఈ షెడ్యూల్ కోవిడ్ కారణంగా నిలిపివేయబడింది. ఈ షెడ్యూల్ లో హీరో ప్రభాస్ మరియు సీనియర్ నటుడు కృష్ణరాజు పాల్గొనాల్సి ఉంది. 10 రోజుల యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించబోతున్నందున, ఈ షెడ్యూల్ ప్రస్తుతానికి నిలిపివేయబడింది.

ఇటీవల లాంఛనంగా ప్రారంభించిన విజయ్ దళపతి 65 చిత్రీకరణలో కూడా పూజ పాల్గొనాల్సి ఉంది, అయితే మహమ్మారి కరోనా పెరుగుతున్న కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిపివేశారు. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో స్పష్టంగా తెలియదు.

x