జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. తన వ్యక్తిగత సిబ్బంది కరోనా రావడంతో, కొంతకాలంగా హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న పవన్ కళ్యాణ్ కు తాజాగా కరోనా సోకింది. ఈ మేరకు జనసేన కత్తి పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం కు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు కార్డియాలజిస్ట్ డాక్టర్ సుమన్ హైదరాబాద్ కు వచ్చి చికిత్స చేస్తున్నట్లు తెలుస్తోంది. ఊపిరితిత్తుల లో కొద్దిగా నిమ్ము చేరటంతో, యాంటీ వైరల్ మందులు లతోపాటు, ఆక్సిజన్ కూడా ఇస్తున్నట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ వచ్చిన సమాచారం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే అపోలో నుంచి ఒక వైద్య బృందం ఫాంహౌస్ కు వెళ్లి పవన్ కళ్యాణ్ ను పర్యవేక్షిస్తున్నారు.

ఇటీవల వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు తో పాటు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న బండ్ల గణేష్ లకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ అప్పటి నుంచే హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.

x