పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ సినిమా ”వకీల్ సాబ్”. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు తో పాటు, బాలీవుడ్ ఫిలిం మేకర్ బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా హిందీలో అమితాబ్ నటించిన ‘పింక్’ సినిమాకి రిమేక్. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కి తగ్గట్టు కొన్ని మార్పులు చేసారు.

పవర్‌స్టార్ పవన్ కళ్యణ్ కమ్ బ్యాక్ సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. బిజినెస్ కూడా 100 కోట్లు వరకు జరుగుతుందని అంచనా. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో పవన్ కళ్యణ్ తొలిసారి వకీల్ పాత్రలో పేక్షుకులను అలరించబోతున్నాడు.

ఈ నేపథ్యంలో ”ఉమెన్స్ డే” సందర్బంగా సర్ ప్రైజ్ ఇచ్చారు పవన్ కల్యాణ్ గారు. వకీల్ సాబ్ నుంచి స్పెషల్ పోస్టర్ రీలిజ్ చేశారు. ఈ పోస్టర్లో పవన్ కళ్యణ్ తో పాటు నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్ల ఉన్నారు.

నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్ల ఈ ముగ్గురు వ్యభిచార గృహాల్లో చిక్కుకున్న అమ్మాయిల్లా కనిపించనున్నారు. వీళ్లని కాపాడేందుకు లాయరుగా పవన్ కల్యాణ్ చేసే పోరాటమే వకీల్ సాబ్ మూవీ.

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో హీరోతో పాటు ఆ ముగ్గురు హీరోయిన్లు కు కూడా సమానమైన ప్రాధాన్యం కల్పించారు అని తెలుస్తుంది. అయితే ఇటీవలే వచ్చిన వివాదపూరిత వార్తల కారణంగా ఈ పోస్టర్ విడుదల చేశారు అని అంటున్నారు.

Vakeel Saab movie release date1

అయితే ఇటీవల ఈ సినిమాలోని మహిళా లీడ్ రోల్స్ ను చూపించటం లేదు అని, మహిళా కేంద్రంగా నడిచే కథను సినిమాగా తెరకెక్కించి వారిని ఎక్కడా చూపించకపోవడం మహిళా వివక్షణ చూపిస్తుందని కొందరు అంటున్నారు.

అయితే నేడు ఈ పోస్టర్ ద్వారా వకీల్ సాబ్ టీం వారికీ సమాధానం ఇచ్చారు, కాగా ఏప్రిల్ 9వ తేదీన ఈ సినిమా పేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదల ఆయన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. తమన్ సంగీతం అందించిన రెండు పాటలు ఇప్పటికే విడుదల అయ్యి పేక్షకులను మెప్పించాయి.

x