ప్రస్తుతం ప్రభాస్ సినిమాల లిస్ట్ చాలా పెద్దగా ఉంది. ఆయన చేస్తున్న సినిమాలు అన్ని ప్యాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం. అయితే, ప్రభాస్ త్వరలో తెలుగు యంగ్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ను కూడా పిక్స్ చేసినట్లు తెలుస్తుంది.

ప్రభాస్ చేస్తున్న సినిమాల లిస్ట్ చుస్తే, 2023 వరకు ఖాళీ లేనంత బిజీ గా ఉన్నారు. ఆయన నటించిన ‘రాధేశ్యామ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ఆదిపురుష్ షూటింగ్ ను కంప్లీట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉంది. ఇవి కాకుండా సాలార్ మరియు ప్రాజెక్ట్- k సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. దీని తరువాత ప్రభాస్ సందీప్ వంగా తో ఒక సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు ‘స్పిరిట్’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు.

ఇవన్నీ పూర్తి కావటానికి రెండు సంవత్సరాల సమయం పడుతుంది. ప్రస్తుతం ప్రభాస్ మరో రెండు సినిమాలను ఒకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ఓ సినిమా హిందీ డైరెక్టర్ తో, మరో సినిమా తెలుగు డైరెక్టర్ మారుతి తో అని తెలుస్తుంది. ప్రభాస్ మారుతి తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారని ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య మరియు ఆచార్య నిర్మాత నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని ప్రచారం సాగుతుంది.

మారుతి గతంలో తీసిన ‘ప్రేమ కథ చిత్రం’ మాదిరిగా ఈ సినిమా ఉంటుందని, దీనికి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ను ఖరారు చేశారని వార్తలు వచ్చాయి. ప్రభాస్ మారుతి దర్శకత్వంలో నటించడం ఏమిటి..? అనే అనుమానం అందరికి వచ్చింది. అయితే, ‘పెద్దగా ఇమేజ్ లేని ఒక సినిమా అనుభవం ఉన్నా సుజిత్ తో సాహో, రాధా కృష్ణ తో రాధాశ్యామ్ సినిమాలు తియ్యగా లేనిది, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతికి ఛాన్స్ ఇవ్వడం లో ఆశ్చర్యం ఏముంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రభాస్ సినిమా పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు మారుతి ట్విట్టర్ వేదికగా స్పందించారు. నా ఫ్యూచర్ ప్రాజెక్ట్, టైటిల్ మరియు జోనర్ పై చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ ఊహాగానాలు అన్నిటికి కాలమే సమాధానం చెబుతుందని మారుతి పేర్కొన్నారు. అయితే, ప్రభాస్ తో సినిమా ఉంటుందని.. ఉండదని.. చెప్పకుండా వ్యూహాత్మకంగా సమాధానమిచ్చారు.

x