పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమా ప్రారంభం నుండే చాలా అడ్డంకులను ఎదుర్కొంటోంది. షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే, ముంబైలోని సెట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. తరువాత మూవీ మేకర్స్ రెండు హై ఎండ్ టెక్ సెట్లను నిర్మించారు మరియు ముంబైలో షూటింగ్ సజావుగా సాగుతున్నప్పుడు, నగరం లో కరోనా రెండవ దశా వల్ల వేలాది కేసులు రావడంతో ఈ షూటింగ్ మళ్ళి నిలిపివేయబడింది.
సమయం వృథా కావడంతో, ఏర్పాటు చేసిన మొత్తాన్ని హైదరాబాద్‌కు మార్చాలని మేకర్స్ నిర్ణయించారు. దీని ప్రకారం ముంబైలో నిర్మించిన సెట్లు ఇటీవల కూల్చివేయబడ్డాయి మరియు హైదరాబాద్లో కొత్త సెట్ల పనులు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు తెలంగాణ లో కూడా లాక్డౌన్ విధించడంతో షూటింగ్ పనులు మరల నిలిపివేయబడ్డాయి.
నిరంతరం ఆలస్యాలతో, ఈ చిత్రం యొక్క బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుంది. సమస్యలు తీరే వరకు వారు వేచి ఉండాల్సిందే. కొంతకాలానికి ఈ అడ్డంకులు అన్ని తొలగిపోతాయి మళ్ళి వారు సమయం వృధా చేయకుండా షూటింగ్ ప్రారంభిస్తారు.
ఓమ్ రౌత్ ‘ఆదిపురుష్’ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నాడు, కృతి సనోన్ హీరోయిన్ గా నటిస్తుంది. సన్నీ సింగ్ లక్ష్మణ్ పాత్రలో కనిపించనున్నారు.