ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తన అభిమానులకు బాక్సాఫీస్ వద్ద మంచి ట్రీట్ ఇవ్వడానికి పలు రకాల సినిమాలను ప్రభాస్ నిర్ణయించుకున్నాడు. సాహో వైఫల్యానికి గురికాకుండా, ప్రభాస్ తన స్క్రిప్ట్ ఎంపికపై శ్రద్ద వహిస్తున్నాడు మరియు ప్రస్తుత కాలంలో ప్రభాస్ అత్యుత్తమ దర్శకులకు ఆమోదం తెలిపాడు. వారిలో ప్రశాంత్ నీల్ ఒకరు. ప్రతిష్టాత్మక సాలార్ ప్రాజెక్ట్ కోసం వీరిద్దరూ చేతులు కలిపారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
సినిమా కథాంశం గురించి లేదా ఈ చిత్రంలో ప్రధాన నటులు పోషించే పాత్రల గురించి ఫిల్మ్ యూనిట్ ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ, ఈ సినిమా గురించి సోషల్ మీడియా అనేక ఊహగానాలతో సందడి చేస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తారని ఒకటి, ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారంటూ ఒకటి, ఈ చిత్రంలో శ్రుతి హాసన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా నటిస్తున్నట్లు ఊహాగానాలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రముఖ తెలుగు దినపత్రిక ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్‌గా పాల్గొన్న సన్నివేశాలు ఈ సినిమా కు ప్రధాన హైలైట్ గా నిలుస్తాయి. ఫిల్మ్ యూనిట్ ప్రస్తుతం మునుపటి షెడ్యూల్లో చిత్రీకరించిన భాగాలను సవరిస్తోంది. ప్రభాస్ మిలటరీ గెట్టాప్ లో కనిపించడం ఇది మొదటిసారి మరియు ఈ పాత్ర ప్రభాస్ కు ఖచ్చితంగా సరిపోతుంది.
సాలార్ సినిమాను హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ చిత్రం సంక్రాంతి 2022 లో రిలీజ్ కానుంది.