ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాక ఎక్కువగా యాక్షన్ మూవీస్ తోనే బిజీ అయ్యారు. దీంతో డార్లింగ్ ఫాన్స్ కొంచెం నిరాశ చెందుతున్నారు. ప్రభాస్ నుంచి ఒక ఫన్ లవ్ స్టోరీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ఈ ఎదురు చూపులకు తెరదించుతూ త్రిపుల్ డోస్ రొమాంటిక్ స్టోరీ చేయబోతున్నాడు.

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా తర్వాత వరుసగా యాక్షన్ స్టోరీస్ కి, థ్రిల్లర్ మూవీస్ కి సైన్ చేశాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సాలార్ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వం లో సైంటిఫిక్ థ్రిల్లర్ ‘ప్రాజెక్ట్-k’ సినిమాను మొదలుపెట్టాడు. వీటితో పాటు సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ స్టార్ లుక్ లోనే కనిపిస్తున్నారు..

బాహుబలి సినిమాలో వారియర్ గా కనిపించిన ప్రభాస్, ఆ తర్వాత వచ్చిన సాహో సినిమాలో మాఫియా స్టార్ గా కనిపించాడు. ఈ లుక్స్ మధ్యలో పరే చేంజ్ అంటూ లవర్ బాయ్ గా వింటేజ్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్” సినిమా చేశాడు. ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. అయితే, ఈ మూవీ తర్వాత మళ్లీ యాక్షన్ స్టోరీస్ లోకి వెళ్ళిపోయాడు.

దీంతో లేడీ ఫ్యాన్స్ ప్రభాస్ మళ్లీ లవ్ స్టోరీస్ కి దూరమవుతున్నారని కొంచెం నిరాశ చెందుతున్నారు. ఇదిలా ఉంటే, ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక ఫన్ లవ్ స్టోరీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మారుతి సినిమాల్లో ఎక్కువగా ఫన్ ఉంటుంది. కానీ, ఈ సినిమాలో కామెడీతో పాటు రొమాన్స్ కూడా ఉండనుంది.

ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని వార్తలు వస్తున్నాయి. త్రిపుల్ టచ్ లవ్ తో ఈ కథ నడుస్తుందని చెప్తున్నారు. ఇక ఈ సినిమాకి “రాజా డీలక్స్” అనే టైటిల్ ను కూడా ఫైనల్ చేశారు. మరి ప్రభాస్ ఈ సినిమాను ఎప్పుడు అధికారికంగా ఎనౌన్స్ చేస్తారో చూడాలి.

x