గోపీచంద్, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ‘సీటీమార్’ సినిమా విజయం పై ప్రభాస్ తాజాగా స్పందించారు. నా స్నేహితుడు గోపీచంద్ సీటీమార్ చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇది నాకు చాలా ఆనందంగా ఉందంటూ ప్రభాస్ చెప్పుకొచ్చారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత అందరు పెద్ద చిత్రాలను థియేటర్లలో రిలీజ్ చేయడానికి బయపడుతుంటే, సీటీమార్ చిత్రబృందం మాత్రం థియేటర్లలోనే సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు. దీంతో ప్రభాస్ చిత్రబృందం మొత్తానికి అభినందనలు తెలిపారు.
View this post on Instagram
సంపత్‌నంది ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో గోపీచంద్ మరియు తమన్నా కబడ్డీ జట్టు కోచ్ పాత్రలో నటించారు. భూమిక చావ్లా, రావు రమేశ్, తణికెళ్ల భరణి కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిత్తూరి నిర్మించారు.