టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆమె తన సినీ పాత్రల వివరాలు మాత్రమే కాకుండా తన వర్క్ ఔట్ వీడియోలను ఇంస్టాగ్రామ్ లో అప్ లోడ్ చేస్తూ ఉంటారు. ఆమె వర్క్ ఔట్ వీడియోలకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆమె వయసు 45 సంవత్సరాలు దాటినా కూడా తన అందంతో కుర్రకారులకు పిచ్చెక్కిస్తుంది.

అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పుష్ప’ లో సమంత చేసిన ఊ అంటావా.. ఊఊ అంటావా.. అనే ఐటమ్ సాంగ్ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఈ పాటకు చాలా మంది సెలబ్రెటీలు స్టెప్పులు వేస్తూ కనిపిస్తున్నారు. అయితే, తాజాగా ప్రగతి కూడా జిమ్ లో ఈ పాటకు స్టెప్పులు వేస్తూ కనిపించారు. ప్రస్తుతం ప్రగతి వేసిన స్టెప్పులు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

x