దర్శకుడు ప్రశాంత్ వర్మ తన వినూత్నమైన ఆలోచనలతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. అతను చివరిగా తీసిన చిత్రం జోంబీ రెడ్డి. ఈ సినిమాను జోంబీ మరియు కరోనా ఇతివృత్తాలపై తెరకెక్కించారు. ప్రస్తుతం, ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్బంగా తన నాల్గొవ సినిమా వివరాలను వెల్లడించారు. తెలుగులో మొదటి ఒరిజినల్ సూపర్ హీరో చిత్రాన్ని తీస్తున్నట్లు ఆయన ఒక టీజర్ ను విడుదల చేశారు.
తెలుగు సూపర్ హీరో హను-మాన్, భారతీయ పురాణాల నుండి ప్రేరణ పొందిన హను-మాన్ సూపర్ హీరో కాన్సెప్ట్‌పై సినిమా రానున్నట్లు అర్ధమవుతుంది. ఈ సినిమాకు హను- మాన్ అనే టైటిల్ ను దృవీకరించారు. ప్రశాంత్ వర్మ నుంచి వస్తున్న నాల్గొవ చిత్రం ఇది.
ఆ టీజర్ లోని హిమాలయా అందాలను చూడటానికి రెండు కళ్ళు సరిపోవు మరియు సంగీతం కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఈ చిత్రం ముఖ్యంగా సూపర్ హీరో ప్రేమికులకు సరికొత్త సినిమా అనుభవాన్ని అందించబోతోంది.