మహి వి రాఘవ్ ‘యాత్ర’ సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఈ సినిమా మాజీ ఆంధ్రప్రదేశ్ సీఎం ‘వైయస్ రాజశేఖర్ రెడ్డి’ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఇప్పుడు, YS రాజశేఖర్ రెడ్డి కుమారుడు YS జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా యాత్ర సినిమాకు సీక్వెల్ చేయబోతున్నట్లు దర్శకుడు ధృవీకరించారు.

ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రను ‘ప్రతీక్ గాంధీ’ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా ఆలిండియా లెవల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రూపొందించాలని దర్శకుడు భావిస్తున్నాడు. అందుకే జగన్ పాత్ర కోసం ప్రతీక్ గాంధీ లాంటి నటుడిని ఎంచుకున్నారు.

ఈ చిత్రం యొక్క ప్రీ-ప్రొడక్షన్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. తెలుగుకు చెందిన ఒక ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. త్వరలోనే ఈ సినిమా పై అధికారిక ప్రకటన చేయనున్నారు. మరోవైపు, ప్రతిక్ గాంధీ బాలీవుడ్లో కొన్ని ఆసక్తికరమైన చిత్రాలతో బిజీగా ఉన్నారు.

 

 

x