గత రెండు నెలల్లో దేశాన్ని కదిలించిన కరోనా సెకండ్ వేవ్ గురించి మాట్లాడిన ప్రధాని మోదీ వాక్సిన్ పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక పై కేంద్ర ప్రభుత్వమే కరోనా వ్యాక్సిన్‌ను తయారీ సంస్థల నుంచి కొనుగోలు చేసి అన్ని రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. టీకా కోసం రాష్ట్రాలు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. గత కొన్ని రోజులుగా టీకా విషయంలో రాష్ట్రాలు, కేంద్రాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న తరుణంలో ప్రధానమంత్రి తాజా ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

వాక్సిన్ ఉత్పత్తి లో ఏడు కంపెనీలు ఇప్పటికే కోవిడ్ -19 తో బిజీగా ఉన్నాయి మరియు అతి త్వరలో మరో మూడు కంపెనీలు బ్యాండ్ వాగన్ కు చేరనున్నాయి. నవంబర్ నాటికి 80 కోట్ల మంది ప్రజలకు టీకాలు పంపిణీ పూర్తవుతుందని పీఎం మోడీ తెలిపారు.

x