కేరళ లో కొనసాగుతున్న కోవిడ్ మరియు లాక్‌డౌన్ ఆంక్షలు కారణంగా మలయాళ నటులు థియేట్రికల్ విడుదల కంటే ఎక్కువగా డిజిటల్ విడుదలను ఎంచుకుంటున్నారు. స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కొన్ని నెలల క్రితం ‘కోల్డ్ కేసు’ సినిమాతో మన ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘కురితి’ సినిమా ఈరోజు అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రదర్శించబడుతుంది.
ఈ సినిమా ట్రైలర్ కు సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. హద్దులు దాటిన మానవ సంబంధాలు, ద్వేషం మరియు పక్షపాతం వంటి వాటి నుండి ఎలా బయట పడాలి అనేదే ఈ సినిమా అంటూ ప్రైమ్ వీడియో పేర్కొంది.
పృథ్వీరాజ్‌తో పాటు ఈ చిత్రంలో రోషన్ మాథ్యూ మరియు మురళీ గోపీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మను వారియర్ ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించారు. జేక్స్ బెజాయ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను చూడాలనుకునే ప్రేక్షకులు అమెజాన్ ప్రైమ్ మీడియాలో ఈ సినిమాను చూడవచ్చు.