ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్ కే’. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ చిత్రం భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా.. ప్రభాస్ కు జోడిగా దీపికా పదుకొనే నటిస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో సమంత అక్కినేని మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మూవీ మేకర్స్ ఇప్పటికే సమంత ను సంప్రదించగా, పాత్ర నచ్చడంతో ఆమె వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబందించిన వివరాలు త్వరలో విడుదల కానున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా మొదటి షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ అమితాబ్ బచ్చన్ తో పాటు మరికొంత మంది నటులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ప్రభాస్, సమంత కంబినేషన్లో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త రావడంతో అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు.

x