పబ్జి లవర్స్ కు గుడ్ న్యూస్ నిషేధానికి గురైన పబ్ జీ గేమ్ మళ్లీ భారతదేశానికి రానుంది. ఈ పబ్ జీ గేమ్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు అందరు ఎంతో ఇష్టపడతారు. వారంతా ఈ గేమ్ ఆడుతూ లోకాన్ని మరిచిపోతారు. ఈ గేమ్ ఆడే వారు రోజుకి ఒక్క సరైన చికెన్ డిన్నర్ కొట్టాలని రోజంతా ఆడుతూ ఉంటారు.
ఈ గేమ్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో చాలా మంది దీనికి బానిస అయ్యారు. చైనా కు సంబందించిన ఈ గేమ్ ను ఇండియా గత సంవత్సరం సెప్టెంబర్ 2న నిషేదించింది. పబ్ జీ ఒక్కదానినే కాదు చైనాకు సంబందించిన అన్ని అప్స్ ను నిషేదించింది ప్రభుత్వం.
దీనితో చాలా మంది పబ్ జీ మళ్లీ ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్నారు. వారి కోరికలు నేరవేరినట్లు కనిపిస్తున్నాయి. అయితే, పబ్ జీ సంస్థ తిరిగి ఇండియా కు వస్తున్నట్టు ఆ సంస్థ పోస్ట్ చేసిన పోస్ట్ ద్వారా అర్ధం అవుతుంది. ‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా’ అనే పేరుతో పబ్ జీ గేమ్ భారతదేశానికి తీసుకు రానున్నట్లు కంపెనీ స్వయంగా ప్రకటించింది.
ఈ గేమ్ మన దేశం కోసం మాత్రమే రూపొందించినట్లు తెలుస్తుంది. దీనితో పాటు టోర్నమెంట్లో లీగ్స్ కోసం ప్రత్యేకమైన ఎకో సిస్టమ్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ గేమ్ అధికారికంగా లాంచ్ కావడానికి ముందు దీనికి సంబంధించిన ఫ్రీ రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని చెబుతుంది.
ఇది ఇండియాలో మాత్రమే లాంచ్ కానున్నట్లు తెలుస్తుంది. పీఎం కేర్ సంస్థకు 1.5 కోట్లు రూపాయలను విరాళంగా ఇచ్చింది పబ్ జీ సంస్థ. ఇవన్నీ చూస్తుంటే పబ్ జీ మళ్లీ ఇండియా కు కచ్చితంగా వస్తుందని పబ్ జీ ప్రియులు ఆనందపడుతున్నారు.