అల్లు అర్జున్ త్వరలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పుష్ప” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుంది.

ఇక తాజాగా ఈ మూవీ నుంచి మొదటి సాంగ్‌ను చిత్ర బృందం కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. “దాక్కో దాక్కో మేక పులోచ్చి కోరుకుద్ది పీక” అంటూ సాగే ఈ పాటను ఐదు భాషల్లో అయిదుగురు ఫేమస్ సింగర్స్ తో పాడించారు. ఈ సాంగ్ లో అల్లు అర్జున్ మాస్ లుక్ తో పాటు డాన్స్ చేసి అదరగొట్టారు. దేవిశ్రీప్రసాద్ అందించిన మాస్ బీట్ ఓ రేంజ్ లో ఉంది. ఈ సాంగ్ అందరికీ ఖచ్చితంగా మంచి విజువల్ ట్రీట్ అవుతుందని చెప్పవచ్చు.

ఈ సినిమా ఎర్రచందనం, స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా మొదటి భాగం క్రిస్‌మస్ పండుగ సందర్భంగా విడుదల కాబోతుంది.

x