అల వైకుంఠపురములో సినిమా తరువాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం పుష్ప. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నారు.

ఈరోజు ఫహద్ ఫాసిల్ పుట్టినరోజు సందర్బంగా చిత్ర బృందం ఫహద్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టల్లో నటుడి కన్ను మాత్రమే కనిపిస్తుంది. “చెడు ఎప్పుడూ అంత ప్రమాదకరమైనది కాదు అంటూ చిత్ర బృందం ఫహద్ ఫాసిల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ముత్తంశెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది.

x