స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా మార్చిన పుష్ప మూవీ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప గత ఏడాది డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఆ తర్వాత మాత్రం బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోయింది. అన్ని భాషల్లో ఇంకా పుష్ప జోరు కొనసాగుతూనే ఉంది.
ఇక బాలీవుడ్ లో అయితే పుష్ప భారీ వసూళ్లు రాబడుతోంది. బాలీవుడ్ లో కేజిఎఫ్ రికార్డ్ ను బద్దలు కొట్టిన బన్నీ దాదాపు 80 కోట్లు కు పైగా వసూళ్లు రావడంతో అక్కడ స్టార్ హీరోల అందరిని ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు, కొంతమంది బాలీవుడ్ స్టార్స్ పుష్ప సినిమా చూసి బన్నీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తం చెల్లించి పుష్ప ఓటిటి హక్కులను సొంతం చేసుకుంది. అందులో భాగంగా జనవరి 7న పుష్ప ను ఓటిటి లోకి తీసుకు వచ్చారు. అయితే దక్షిణాది భాషల్లో మాత్రమే పుష్ప ను ఓటిటి లో రిలీజ్ చేశారు. మామూలుగా అయితే అన్ని భాషల్లో పుష్ప సినిమా ఒకేసారి ఓటిటి లోకి రావాల్సి ఉంది.
కానీ, ఈ సినిమాకు హిందీలో అనూహ్యమైన స్పందన రావటం తో హిందీ ఓటిటి వెర్షన్ ను కాస్త ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న పుష్ప హిందీ వర్షన్ ఓటిటి లోకి రాబోతుంది. ఇప్పటికే ఓటిటి లో రిలీజ్ అయిన పుష్ప కు మంచి స్పందన వచ్చింది. దాంతో ప్రస్తుతం థియేటర్లోనే కాదు, ఓటిటి లో కూడా పుష్ప తన సత్తాను చాటుతోంది. ఈ నేపథ్యంలో పుష్ప పార్టీ 2 ను భారీగా తెరకెక్కించేందుకు దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు.