స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యొక్క పుష్పా టీజర్ 50 మిలియన్ల వ్యూస్ ను సాధించింది. 19 రోజుల్లో ఈ అరుదైన ఘనతను సాధించింది. టాలీవుడ్లో ఇది కొత్త రికార్డ్. కథానాయకుడు పుష్పా రాజ్ పాత్రను పరిచయం చేస్తున్న ఈ టీజర్ ఇప్పటివరకు 1.2 మిలియన్లకు పైగా లైక్‌లు మరియు 1 లక్ష పైగా కామెంట్స్ ను సంపాదించింది.
ఈ టీజర్లో సుకుమార్ యొక్క మార్క్ కనిపిస్తుంది, యాక్షన్ స్టంట్స్, అల్లు అర్జున్ యొక్క మాస్ గెటప్, అతని మేక్ఓవర్, అతని బాడీ లాంగ్వేజ్ సినిమా పై ఎక్సపెక్టషన్స్ ను పెంచుతుంది. టీజర్ అటువంటి రికార్డును సృష్టించడంతో, ఈ సినిమా పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఫహద్ ఫైసల్ అల్లు అర్జున్ కి విరోధిగా కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో సహా 5 భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.