పుష్ప డబ్బింగ్ పనులు ప్రారంభించారు. చిత్ర యూనిట్ షూటింగ్ పూర్తి కాకుండానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసింది. అల్లు అర్జున్ హీరోగా మాస్ యాక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా లో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ నటిస్తుంది. ఈ సినిమాతో మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రం 2021 ఆగస్టు 13 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది, సునీల్, ఆర్య, సునీల్ శెట్టి ప్రముఖ పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా ను 180 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. సుకుమార్ ఈ చిత్రాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.
మరోవైపు అల్లు అర్జున్ బర్త్ డే సందడి మొదలైంది. ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు ఏర్పాటు చేస్తున్నారు. బన్నీ బర్త్ డే కామన్ డీపీ ని టాలీవుడ్ దర్శకులు హీరోలు హీరోయిన్లు లాంచ్ చేశారు. ఈరోజు సాయంత్రం పుష్ప సినిమా నుంచి ఒక టీజర్ రిలీజ్ అయింది. అది చూడటానికి ఉరమాస్ లాగా ఉంది.