అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా 100 కోట్లు మిస్ చేసుకుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా గ్రాస్ మరియు 120 కోట్లకు పైగా షేర్ ను కలెక్ట్ చేసింది. మరి ఈ 100 కోట్లు మిస్సింగ్ ఏంటి..?

పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ అని బన్నీ ముందే చెప్పాడు. ఫ్లవర్ అనుకున్నవాళ్ళు చెవులో పువ్వు పెట్టుకోవాల్సి వచ్చింది. బన్నీ మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాను ఐదు భాషల్లో రిలీజ్ చేశారు. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాకు మంచి లాభాలు వచ్చాయి.

ఇదిలా ఉంటే, హిందీ ఆడియన్స్ ఈ సినిమాను ఎలా ఆదరిస్తారో అని భావిస్తే వారు బ్రహ్మరథం పట్టారు. రీసెంట్ గా సినిమా చూసిన జాన్వి కపూర్ బన్ని పై ప్రశంసలు కురిపించారు. పుష్ప సినిమా రిలీజ్ చేసి 24 రోజులైనా ఇప్పటికీ హిందీలో ఈ సినిమా రోజుకి దాదాపు కోటి రూపాయలు వసూళ్లు చేస్తుంది. వీకెండ్ లో అయితే దాదాపు 2 కోట్లకు పైగా రాబడుతోంది. హిందీ వర్షన్ ఇప్పటివరకు 80 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.

ఈ సినిమా హిందీ లో 100 కోట్ల మార్కును చేరుకుంటుందని అందరు భావించారు. కానీ, ఈ సినిమా యొక్క హిందీ వర్షన్ ఓటిటి లో 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కావడంతో 100 కోట్ల మార్కును అందుకోలేకపోయింది. హిందీ మినహా అన్ని భాషల్లో ఈ సినిమాను 7వ తేదీ నుంచే ఓటిటి లో స్ట్రీమింగ్ చేశారు. ఐతే, బాలీవుడ్ కలెక్షన్స్ బాగుండటంతో ఈ సినిమాను వారం రోజులు లేటుగా ఓటిటి లోకి రిలీజ్ చేశారు.

హిందీలో సంక్రాంతికి పెద్ద సినిమాలు ఏమీ లేవు. రన్ వీర్ సింగ్ నటించిన 83 మూవీ కంటే పుష్ప సినిమా వసూళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ లెక్కన ఈ సినిమా ఇంకో రెండు వారాల పాటు థియేటర్లో ఉంటే 100 కోట్ల మార్కును అందుకునేది. ఒకసారి ఓటిటి లోకి వచ్చాక థియేట్రికల్ కలెక్షన్స్ పడిపోతాయి. ఇలా పుష్ప బాలీవుడ్ లో 100 కోట్లు మిస్ చేసుకుంది.

x