తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో రాధే శ్యామ్ చిత్రం ఒకటి. ఈ చిత్రంలో ప్రభాస్, పూజ హెగ్డే ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రాధే శ్యామ్ ఫిల్మ్ యూనిట్ ఈ చిత్రం యొక్క స్ట్రీమింగ్ హక్కులను విక్రయించింది. ప్రస్తుతం రాధే శ్యామ్ ఫిల్మ్ యూనిట్, RRR నిర్మాతల యొక్క అడుగు జాడలను అనుసరిస్తున్నారు. రాధే శ్యామ్ చిత్రం నెట్‌ఫ్లిక్స్ మరియు జీ 5 ప్లాట్ ఫామ్ లో ప్రసారం కానుంది.

రాధే శ్యామ్ యొక్క హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ లో ప్రసారం కానుండగా, ఇతర వెర్షన్లు (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) జీ 5 లో ప్రసారం కానున్నాయి. అదేవిధంగా RRR యొక్క హిందీ వెర్షన్ ను నెట్‌ఫ్లిక్స్ మరియు ఇతర భాషలను జీ 5 విక్రయించారు.

అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల యొక్క స్ట్రీమింగ్ హక్కులను పొందటంలో నెట్‌ఫ్లిక్స్ మరియు జీ 5 రెండు స్నేహభావంతో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. సినిమాల యొక్క బహుళ భాషలను జీ 5 ఎంచుకోవడం ఇదే తొలిసారి. జీ 5 తన మార్కెట్ ను దక్షిణాదిలో పెంచుకోవాలని చూస్తుంది.

రాధే శ్యామ్ మూవీ మేకర్స్ చిత్రం యొక్క స్ట్రీమింగ్ హక్కులను మంచి మొత్తానికి అమ్మారు. ఫిల్మ్ యూనిట్ ఈ చిత్రం యొక్క అధికారిక విడుదల తేదీని ఇంకా ధృవీకరించలేదు.

x