పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తుంది. దాదాపు 10 ఏళ్ళ తరువాత ప్రభాస్ చేస్తున్న లవ్ స్టోరీ సినిమా ఇది. అయితే, తాజాగా మూవీ మేకర్స్ ‘కృష్ణాష్టమి’ సందర్భంగా సినిమాకు సంబంధించి ఓ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది.

ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్, టీజర్‌లు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ప్రభాస్ ఈ సినిమాలో విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించనున్నారు. కరోనా వల్ల షూటింగ్స్ వాయిదా పడటంతో చిత్రబృందం ఈ సినిమాను జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయింది. దీంతో మూవీ మేకర్స్ ఈ సినిమాను జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

గోపీకృష్ణ మూవీస్ పతాకంపై కృష్ణం రాజు మరియు టీ సిరీస్ భూషణ్ కుమార్, యూవి క్రియేషన్స్ పతాకంపై వంశీ-ప్రమోద్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

x