ప్రస్తుతం ప్రభాస్ ఒక పాన్ ఇండియా స్టార్ మరియు మాస్ లోను మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ చేస్తున్న సినిమాల తీరు చూస్తుంటే రానున్న రోజుల్లో ప్రభాస్ దేశంలోనే అతిపెద్ద స్టార్ గా కనిపించనున్నారు.
ప్రభాస్ చివరగా నటించిన సినిమా సాహో ఆ సినిమా తెలుగులో పెద్దగా క్లిక్ అవ్వకపోయినా హిందీ లో భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. దీంతో బాలీవుడ్ లో ప్రభాస్ రేంజ్ ఏంటో తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాతో ఒక రొమాంటిక్ గెటప్ లో మన ముందుకు రానున్నారు.
ఈ చిత్రం దాదాపు పూర్తి అయ్యింది. దీంతో ప్రభాస్ ఈ సినిమా యొక్క ఎడిటింగ్ పనులను దగ్గరుండి చూసుకోవాలని అనుకుంటున్నారు. ఈ చిత్రం లో ఎటువంటి ల్యాగ్ ఉండకూడదని ప్రభాస్ అభిప్రాయపడుతున్నారు. మూవీ మేకర్స్ చాలా కంటెంట్ ను చిత్రీకరించారు. దీంతో సరైన కంటెంట్ ను ప్రేక్షకులముందుకు తీసుకురావాలని ప్రభాస్ ప్రయత్నిస్తున్నారు.
ఈ సినిమా కోసం కొన్ని ప్రత్యేకమైన ప్రమోషన్లు చేయనున్నట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. రాధే శ్యామ్ ఒక రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కింది. రాధా కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.