ప్రభాస్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ మరో మూడు రోజుల్లో ముగియనుంది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘రాధే శ్యామ్’ టీజర్ ను విడుదల చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం చిత్ర బృందం ఒక పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లో విక్రమాదిత్య అనే పేరు ఉంది.

అసలు విక్రమాదిత్య ఎవరో తెలియాలంటే.. అక్టోబర్ 23న రాధే శ్యామ్ టీజర్ చూడాల్సిందే. మూవీ మేకర్స్ ఈ టీజర్ ను బహు భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని యువి క్రియేషన్స్ “గ్లోబల్ ప్రభాస్ డే” అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

ఈ సినిమాకు రాధా కృష్ణ దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ‘జస్టిన్ ప్రభాకరన్‌‘ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. యు.వి.క్రియేషన్స్, గోపి కృష్ణ ఫిలిమ్స్ మరియు T- సిరీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 14 2022న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది.

అక్టోబర్ 23న రాధే శ్యామ్ టీజర్ తో పాటు ప్రభాస్ నటిస్తున్న సాలార్, ఆదిపురుష్ మరియు ప్రాజెక్ట్ K సినిమాల నుండి అప్ డేట్స్ వస్తాయని ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్నారు.

x