పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన “రాధే శ్యామ్” సినిమా వాయిదా వేయడంతో ప్రభాస్ అభిమానులు అందరూ నిరాశ చెందారు. అంతా సవ్యంగా జరిగి ఉంటే రాధే శ్యామ్ సినిమా కేవలం మూడు రోజుల్లోనే భారీ విడుదలకు సిద్ధమయ్యాది. కానీ కరోనా థర్డ్ వేవ్ కారణంగా ఈ సినిమా వాయిదా వేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.

కానీ, దర్శకుడు రాధాకృష్ణ ప్రభాస్ అభిమానులలో జోష్ నింపడానికి రాధే శ్యామ్ సినిమాకు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు ఇంటర్ నెట్ లో వైరల్ అవుతున్నయి.

ఈ సినిమా యొక్క కొత్త విడుదల తేదీని మూవీ మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమ్ ఆదిత్యగా, పూజా హెగ్డే ప్రేరణగా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

x