తిరుపతికి చెందిన రైల్వే పోలీసు తన ధైర్యసాహసంతో ఒక మహిళ ప్రాణాలను కాపాడాడు. తిరుపతి రైల్వేస్టేషన్ లో ఈ ఘటన జరిగింది. రైల్వేస్టేషన్ లో ఉదయం 4 గంటల 30 నిమిషాలకు తిరుమల ఎక్స్ప్రెస్ రైలు స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఇంతలో ఒక మహిళ కదులుతున్న రైలు నుంచి కిందకు దిగుతుండగా ఆ మహిళా ఒక్క సారిగా రైలు కింద పడబోయింది.

ఇంతలో అక్కడ డ్యూటీలో ఉన్న రైల్వే పోలీస్ సతీష్ ఆమె రైలు కింద పడిపోవడం గమనించి అప్రమత్తమయ్యాడు, ఆమెను వెంటనే రైలు కింద పడిపోకుండా పైకి లాగాడు. దీనితో ఆమె ప్రాణాలతో బయట పడింది. ఈ దృశ్యాలు అంతా రైల్వేస్టేషన్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మహిళను కాపాడిన రైల్వే పోలీస్ సతీష్ ను అక్కడ ఉన్నవారంతా అభినందించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మాధ్యమాలల్లో వైరల్ అవుతుంది.

image source

x