దర్శకధీరుడు రాజమౌళి ఎప్పుడు సంతోషంగా లేని విషయం గురించి మాట్లాడలేదు. సినిమాలు కాకుండా వివిధ విషయాలపై తన అభిప్రాయాలను చెప్పడానికి రాజమౌళి తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను ఉపయోగిస్తారు. ఈ రోజు ఆయన ఢిల్లీ ఎయిర్ పోర్టు తీరుపై తన అసంతృప్తిని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో తాను చూసిన ఒక సంఘటనను రాజమౌలీ తన ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నారు.

అయన ట్విట్టర్ లో ఇలా రాశారు, ప్రియమైన ఢిల్లీ ఎయిర్ పోర్టు.. “లుఫ్తానాసా విమానంలో ఉదయం 1 గంటకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరాను. అక్కడ ఆర్టిపిసిఆర్ దరఖాస్తు నింపడానికి ఫారాలు ఇచ్చారు. ప్రయాణీకులందరూ దరఖాస్తు నింపడానికి నానా తంటాలు పడుతున్నారు. కొంతమంది నిలబడి ఫామ్ ఫిల్ చేస్తుంటే మరికొంత మంది గోడ మీద పేపర్ పెట్టి ఫిల్ చేస్తున్నారు. ఈ విషయం పై రాజమౌళి తన అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు దరఖాస్తు నింపడానికి టేబుల్స్ ను ఏర్పాటు చేయడం ఒక కనీస బాధ్యత” అని తన అభిప్రాయాన్ని తెలియచేశారు.

ఆయన మరో విషయాన్ని కూడా తెలియచేశారు. అది ఏమిటంటే ఎయిర్ పోర్టు బయట అనేక వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయని ఆయన తెలిపారు. విదేశీయులు ఎవరైనా మన దేశాన్ని పర్యటించడానికి వస్తే వారికి ఇలాంటి దృశ్యాలతో స్వాగతం పలకడం అనేది మన దేశ గౌరవానికి మంచిది కాదు.. దయచేసి ఇలాంటి సంఘటనలపై దృష్టి పెడతారని ఆశిస్తున్నాను” అని రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.

ఆయన ట్వీట్ చేసిన కొద్దీ క్షణాల్లోనే అది వైరల్ గా మారింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఢిల్లీ ఎయిర్ పోర్ట్ వెంటనే స్పందించారు. “మీరు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ కు ధన్యవాదాలు సర్. ఫామ్స్ ఫిల్ చేయడానికి టేబుల్స్ ఏర్పాటు చేస్తాము మరియు ఎయిర్ పోర్ట్ చుట్టుపక్కల వాతావరణం క్లీన్ గా ఉంచుతాము” అని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు రీట్వీట్ చేశారు.

x