హీరో రాజశేఖర్ చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆయన చివరగా నటించిన సినిమా కల్కి. ఈ సినిమా తర్వాత ఆయన రెండు సినిమాలను లైన్ లో పెట్టారు. కానీ, గత రెండు నెలలగా వాటి గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు.
కొన్ని సంవత్సరాల క్రితం రాజశేఖర్ నెగటివ్ పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. ఆయన బహిరంగంగా ఒప్పుకున్నప్పటికీ, ఏ దర్శకుడు ఆ ప్రయత్నం చేయలేకపోయారు. కానీ, ప్రస్తుతం రాజశేఖర్ ఒక విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు శ్రీవాస్, గోపీచంద్ కలియకలో ఒక సినిమా రానుంది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు రాజశేఖర్ ను సంప్రదించగా ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది.