చిత్ర పరిశ్రమలో స్నేహం విషయానికి వస్తే, మోహన్ బాబు మరియు రజనీకాంత్ స్నేహం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇద్దరు మంచి స్నేహితులలో ఎవరికైన ఖాళీ సమయం దొరికితే తన స్నేహితుడితో సమయం గడపాలని కోరుకుంటారు.
కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో శివ దర్శకత్వంలో రజనీకాంత్ తన కొనసాగుతున్న షూటింగ్ పూర్తి చేశారని, ఆ తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ మోహన్ బాబుతో కలిసి తన నివాసంలో రెండు రోజులు గడిపారని తెలిసింది.
వారు కొంత విలువైన సమయాన్ని గడిపారు, అనిపిస్తుంది. వారు ఎన్నో పాత విషయాలు గుర్తు తెచ్చుకున్నారు. వీరు అనేక సూపర్ హిట్ చిత్రాలలో కలిసి నటించారు.
వీరు కలుసుకున్న ఫొటోస్ ను మంచు విష్ణు పోస్ట్ చేసారు. ఫొటోస్ పోస్ట్ చేస్త విష్ణువు వారిని ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్ (OG లు) గా సంబోదించాడు. “ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్ రజనీకాంత్, మోహన్ బాబు మరియు తర్వాత విష్ణు మంచు, ”అని ట్వీట్ చేశాడు. రజనీకాంత్ మరియు మోహన్ బాబు మరో క్రేజీ మల్టీస్టారర్ కోసం కలిసి పనిచేస్తారని ఆశిస్తున్నాము!
The OGs. Original Gangsters! @rajinikanth @themohanbabu and then goofy Vishnu Manchu pic.twitter.com/2eUoaKDo5Q
— Vishnu Manchu (@iVishnuManchu) May 21, 2021