బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రమేష్ వర్మ తెరకెక్కించిన రాక్షసుడు సినిమా 2019లో విడుదలై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా విడుదలై రెండేళ్ళు పూర్తిచేసుకుంది. నిర్మాత కోనేరు సత్యనారాయణ ఇటీవలే దర్శకుడితో రాక్షసుడు 2 సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు.

రాక్షసుడు 2 సినిమా మొదటి దానికంటే చాలా ఉత్కంఠ భరితంగా ఉండనున్నట్లు దర్శకుడు చెప్పుకొచ్చారు. రాక్షసుడు 2 సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నారు. కనుక, ఈ సినిమా కోసం పెద్ద హీరోని ఎంచుకోబోతూన్నట్లు నిర్మాత కోనేరు సత్యనారాయణ చెప్పుకొచ్చారు.

కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ, “ఈ సినిమాను వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు మరియు ఈ సినిమాలో చాలా యాక్షన్ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సినిమాను హాలీవుడ్ చిత్రం లాగా సుదీర్ఘ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాము” అని ఆయన తెలిపారు.

x