బెల్లంకొండ శ్రీనివాస్ ‘రాక్షసుడు’ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీ తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను రమేష్ వర్మ తెరకెక్కించారు. ప్రస్తుతం రమేష్ వర్మ మాస్ మహారాజా రవితేజ తో ‘ఖిలాడి’ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో వుండగా రమేష్ వర్మ మరో ప్రాజెక్ట్ ని ప్రకటించారు. రాక్షసుడు చిత్రానికి సీక్వెల్ గా ”రాక్షసుడు 2” తెరకెక్కిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సినిమా యొక్క టైటిల్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.
రాక్షసుడు 2 సినిమా ‘హోల్డ్ యువర్ బ్రీత్’ అనే ట్యాగ్ లైన్ తో వస్తుంది. విడుదల చేసిన పోస్టర్లో ఒక సైకో కిల్లర్ ఎడమ చేతిలో గొడ్డలిని పట్టుకొని.. తన భుజం మీద ఒక గుర్తుతెలియని మృత దేహాన్ని మోసుకెళ్ళడం మనం చూడవచ్చు. అలాగే, రక్తం కారుతున్న కత్తిని గొలుసుతో వేలాడదీయడం మనం చూడవచ్చు. దీంతో పోస్టర్ చూడటానికి చాలా భయంకరంగా ఉంది.
ఈ సీక్వెల్ కోసం ఒక స్టార్ హీరోని తీసుకోవాలని మూవీ మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్, శ్రీకాంత్ విస్సా తో కలిసి ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. గిబ్రాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.