సాహో ఫీల్మ్ మేకర్ సుజిత్ చాలా కాలంగా వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. సుజీత్ చేసింది రెండు సినిమాలు. మొదటిది శర్వానంద్ తో రన్ రాజా రన్, రెండోది ప్రభాస్ తో సాహో. ఈ రెండు సినిమాలు తర్వాత సుజిత్ చిరంజీవితో సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆ వార్తలు నిజాం కాలేదు. ఇప్పుడు ఆయన రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి.
రామ్ చరణ్ ప్రస్తుతం RRR, ఆచార్య, RC15 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది చివర్లో సుజీత్ సినిమాను ప్రారంభిస్తారని సమాచారం. యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు రామ్ చరణ్ కూడా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది.
ఈ క్రేజీ కాంబో త్వరలో సెట్స్ పైకి వెళ్తుందా.. లేదా.. అనేది చూడాలి. మరోవైపు RRR తన షూటింగ్ వర్క్ ను పూర్తి చేసుకోబోతోంది. ఈ సినిమా అక్టోబర్ 13 2021న థియేటర్స్ లో విడుదల కానుంది.