నందమూరి నట సింహం బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ ఓటిటి ఆహ లో వస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షోకి విపరీతమైన ప్రజాదరణ లభిస్తుంది. బాలయ్య హోస్టింగ్ ప్రేక్షకుల అందరికి విపరీతంగా నచ్చింది. ఈ షోలో బాలయ్య తన మాటలతో అందర్నీ కట్టిపడేస్తున్నాడు. దీంతో బాలయ్య వెండి తెరపై మాత్రమే కాకుండా ఓటిటి లోను తన సత్తా ను చాటుతున్నాడు.

ఇప్పటికే ఈ షో కు మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, రవితేజ, అల్లు అర్జున్, రాజమౌళి, విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ వంటి స్టార్స్ వచ్చి సందడి చేశారు. అలాగే మహేష్ బాబు ఎపిసోడ్ తో ఈ షో కి ఫైనల్ టచ్ ఇవ్వనున్నట్లు సమాచారం.

ఇక ఈ షో కి వచ్చిన గెస్ట్ లను బాలకృష్ణ తనదైన శైలితో, పంచులతో, డైలాగ్స్ తో మరియు స్వీట్ వార్నింగ్ లతో అందరిని అలరించాడు. దాంతో ఈ షో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరికీ కనెక్ట్ అయింది. తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా ఈ షో పై మనస్సు పరేసుకున్నాడు. అయితే ఎంతో మంది స్టార్స్, సెలబ్రిటీస్ పాల్గొన్న ఈ షోలో రామ్ గోపాల్ వర్మకు ఛాన్స్ వస్తుందో.. లేదో.. అని బాలయ్య ను రిక్వెస్ట్ చేశాడు.

ఆహా లో వస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షో నాకు విపరీతంగా నచ్చింది. ఈ షో లో అతిథిగా పాల్గొనాలనే కోరికగా ఉంది. బాలకృష్ణ గారు నాకు అవకాశం ఇస్తారని ఆశపడుతున్నాను అంటూ వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. అయితే కాసేపు తర్వాత వర్మ ఆ ట్వీట్‌ను తొలగించాడు. దీన్ని తొలగించడానికి గల కారణం ఇప్పటి వరకు తెలియరాలేదు. ఇదిలా ఉంటే వర్మ కోరికను బాలయ్య మరియు ఆహా టీమ్ నెరవేరుస్తుందేమో చూడాలి. అదే జరిగితే ఆ ఎపిసోడ్ సూపర్ హిట్ కావడం ఖాయం.

 

x