బిగ్ బాస్ 5వ సీజన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు బుల్లితెర చరిత్ర లో కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకుల ఆధరణ సొంతం చేసుకొని సూపర్ హిట్ షో గా ముందుకు సాగుతుంది. ఈ షో ఇప్పటికే మన దగ్గర నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇవన్నీ ఒకదానికి మించి ఒకటి విజయవంతమయ్యాయి. ఈ ఉత్సాహంతోనే త్వరలో మేకర్స్ బిగ్ బాస్ 5వ సీజన్ ను మన ముందుకు తీసుకురాబోతున్నారు.
ఇప్పటికే, ఈ షో టాప్ TRP రేటింగ్ ను దక్కించుకుంది. తెలుగులో బిగ్ బాస్ షో అంతలా సక్సెస్ అవుతాననికి గల కారణం, దానిని ముందుండి నడిపించిన హోస్ట్ లు ప్రధాన కారణమని చెప్పాలి. నాలుగు సీజన్లను ముగ్గురు స్టార్ హీరోలు అద్భుతంగా ప్రేక్షకులోకి తీసుకు వెళ్లారు. మొదటి సీజన్ ఎన్టీఆర్, రెండవ సీజన్ నాని, మూడు మరియు నాలుగు సీజన్లలో నాగార్జున తమదైన హోస్టింగ్ తో షోకి విజయాన్ని అందించారు.
ఈ నాలుగు సీజన్ల విజయవంతంగా పూర్తి కావడంతో బిగ్ బాస్ మేకర్స్ 5వ సీజన్ కోసం పనులను ప్రారంభించారు. కరోనా ప్రభావం కారణంగా షో కొంచెం ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ, మేకర్స్ తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇందులో భాగంగా సెట్ నిర్మాణం, కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియలు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి. మరో కొద్ది రోజుల్లో బిగ్ బాస్ 5వ సీజన్ ప్రారంభం కాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇది సెప్టెంబర్ 5వ తేదీ నుండి ప్రచారం కాబోతోందని వార్తలు వస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, ఈ సీజన్ నుంచి అక్కినేని నాగార్జున తప్పుకున్నారు అనే వార్తలు వస్తున్నాయి. రెండేళ్లుగా హోస్ట్ చేస్తున్న ఆయన ఈ సీజన్ కు అందుబాటులో ఉండటం లేదని వార్తలు వస్తున్నాయి. పలు చిత్రాలను ప్రకటించిన ఆయన వాటి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
ఇక నాగార్జున స్థానంలో టాలీవుడ్ స్టార్ హీరో “దగ్గుబాటి రానా” 5వ సీజన్ కు హోస్ట్ గా చేస్తున్నారని కూడా తెలిసింది. నాగార్జున తప్పుకున్న తర్వాత బిగ్ బాస్ నిర్వాహకులు పలువురు హీరోలతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే దగ్గుబాటి రానా ను ఎంచుకున్నారని తెలిసింది. ఈ స్టార్ హీరో గతంలో నం.1 యారీ షో కు హోస్ట్ గా చేశారు. ఆ అనుభవంతోనే ఈ సీజన్ నడిపించడానికి ఒప్పుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాలి.