సీనియర్ నటుడు రావు రమేష్ మహా సముద్రం సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ మరియు సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ రోజు రావు రమేష్ పుట్టినరోజు సందర్బంగా అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ, మూవీ మేకర్స్ చిత్రంలో అతని ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేసింది.
పోస్టర్ లో రావు రమేష్ గూని బాబ్జీగా కనిపించాడు. దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రంలో ఉన్న ప్రతి నటుడిని ఒక ప్రత్యేకమైన రీతిలో చూపిస్తున్నాడు. అదేవిధంగా, ఈ చిత్రంలో రావు రమేష్ ను కూడా చూపించాడు.
తెలుగు-తమిళం లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అదితి రావు హైదరి, అను ఇమ్మానుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. విశాఖపట్నం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ మహా సముద్రం సినిమా లవ్ మరియు యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ చిత్రం షూట్ పూర్తయింది.