గుంటూరు జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇలాంటి సమయంలోనే మరికొన్ని కొత్త అనారోగ్య సమస్యలు బయటపడుతున్నాయి. తల్లి నుంచి పుట్టిన బిడ్డకు వైరస్ సోకడం అందరిని ఆందోళన కలిగిస్తోంది. కరోనా బారిన పడిన మూడు రోజుల పసికందు కు డాక్టర్లు అరుదైన ఆపరేషన్ నిర్వహించారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట కు చెందిన ఓ మహిళా మే 31న డెలివరీ కోసం హాస్పటల్ లో చేరండి. అయితే, ఆమెకు 9వ నెలలో కరోనా సోకింది. వైద్యుల సలహాలతో మందులు వాడింది. డెలివరీ సమయంలో కోవిడ్ పరీక్ష నిర్వహిస్తే నెగిటివ్ వచ్చింది. దీంతో వైద్యులు ఆమెకు డెలివరీ చేశారు.
పుట్టిన చిన్నారి కి అనారోగ్య సమస్యలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. శిశువుకు కడుపు ఉబ్బరంగా ఉండటం మరియు పసరు వాంతులు అవుతున్నట్లు వారు గుర్తించారు. శిశువు కనీసం పాలు కూడా తాగటం లేదు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రైవేట్ హాస్పటల్ కు తరలించారు.
హాస్పటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు శిశువు పేగులో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. వారు వెంటనే ఆపరేషన్ చేసి పేగును తొలగించారు. రక్తం గడ్డకట్టడం తో పేగు పూర్తిగా పాడైపోయింది. తల్లి గర్భిణిగా ఉన్నప్పుడే కరోనా సోకడం తో ఆ ఇన్ఫెక్షన్ శిశువుకు కూడా సోకింది. దీనితో వైద్యులు శిశువులో యాంటీబాడీస్ ఉండటం గుర్తించారు. తల్లి గర్భంలోనే శిశువుకు కరోనా సోకటం వల్ల పేగులు ఇలా అవటం ఇదే తొలిసారి అని డాక్టర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం శిశువు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.