దక్షిణాది అందమైన నటీమణుల్లో రష్మిక మందన ఒకరు. ఈమె తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటింది. ప్రస్తుతం ఆమె తన మొదటి బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా విడుదలకు ముందే, రెండో సినిమా లో కూడా ఆమె నటిస్తున్నారు. ఈ చిత్రం ఆమెకు ఎంతో ప్రత్యేకమైనది, ఎందుకంటే లెజెండ్రీ యాక్టర్ అమితాబచ్చన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది.

ఈ చిత్రానికి “గుడ్బై” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. బిగ్ బి సినిమాలో అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. బిగ్ బి సినిమాలో తాను ఒక పాత్ర చేస్తున్నాను అని తన కుటుంబంతో చెప్పిన వారు అసలు నమ్మలేదు. అందరిలాగే నా తల్లిదండ్రులు కూడా అమితాబ్ బచ్చన్ కి వీరాభిమానులు. నా చిన్నతనంలో ఆయన సినిమాలు చాలా చూశానంటూ ఆమె చెప్పారు.

ప్రస్తుతం రష్మిక మందన తన మొదటి బాలీవుడ్ చిత్రం మిషన్ మజు లో సిద్ధార్థ మల్హోత్రా సరసన నటిస్తున్నారు. అంతేకాదు శాంతను బాగ్చి దర్శకత్వం వహిస్తున్న స్పై థ్రిల్లర్ గుడ్ బై సినిమాలో కూడా రష్మిక నటిస్తున్నారు. ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వం వహించిన, అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప మూవీ లో కూడా ఆమె నటిస్తున్నారు.

x