రష్మిక మిషన్ మజ్ను మూవీతో బాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది. ఈలోగా అక్కడి ఆడియెన్స్ కి దగ్గర అవడానికి ఒక ప్రైవేట్ సాంగులో చిందులేసింది.
మిషన్ మజ్ను రిలీజుకి ముందే ఈ ఆల్బమ్ తో బాలీవుడ్ తో పరిచయం పెంచుకుంటుంది. సరిలేరు నీకెవరు, భీష్మ, వంటి వరస హిట్ల తరువాత బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసింది.
పుష్ప షెడ్యూల్ పూర్తీ చేసిన తరువాత బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను షూటింగులో రీసెంటుగా జాయిన్ లేదో టాప్ టక్కర్ ఆల్బంలో మెరిసింది. ప్రముఖ పాప్ సింగర్ బాద్షా, యువన్ శంకర్ రాజా, గాంధీతో కలిసి ఆడిపాడింది ఈ బ్యూటీ.
యువన్ శంకర్ రాజా కూడా అనిరుద్ద్ ని ఫాలో అవుతున్నాడు. తెలుగులో అజ్ఞాతవాసి, గ్యాంగ్ లీడర్ కి మ్యూజిక్ ఇస్తూ ప్రమోషనల్ సాంగ్స్ లో నటించాడు అనిరుద్ద్. ఇక తమిళంలో అయితే సరే సరి, తన పాదం కదపకుండా సినిమాలు రిలీజ్ కావు.
ఇళయరాజా వారసుడు, యువన్ శంకర్ ఇదే ఫార్ములాని ఫాలో అవుతూ, మ్యూజిక్ ఇచ్చిన టాప్ టక్కర్ వీడియోలో స్టెప్పులేశాడు.