ఛలో సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ప్రస్తుతం అగ్ర కథానాయికల్లో ఒకరిగా నిలిచారు. ఆమెకు ఇప్పటివరకు ఒక్క హిందీ సినిమా లేనప్పటికీ, గీతా గోవిందం సినిమా తో నార్త్ లో భారీ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. రష్మీకను ‘నేషన్స్ క్రష్’ అని కూడా పిలుస్తారు.

25 ఏళ్ల ఈ హీరోయిన్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో కొత్త మైలురాయిని సాధించండి. తాజాగా రష్మిక ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 20 మిలియన్లకు చేరింది. పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్, కియారా అద్వానీ, జాన్వీ కపూర్ల కంటే రష్మికకు ఇప్పుడు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీన్నిబట్టి ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో తెలుస్తుంది.

ఆమె తక్కువ సినిమాలు చేసినప్పటికీ, ఈ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకోవడం నిజంగా విశేషం అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ కెనడా బ్యూటీ ‘పుష్ప’ షూటింగ్ లో బిజీగా ఉంది. మరోవైపు ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే చిత్రంలో కూడా నటిస్తోంది. రష్మిక త్వరలో బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆమె చేతిలో ఇప్పుడు ఫేర్వెల్ మరియు మిషన్ మజ్ను అనే రెండు హిందీ చిత్రాలు ఉన్నాయి.

x