మాస్ మహారాజా రవితేజ తల్లి పై జగ్గంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మి తో పాటు మర్రిపాకకు చెందిన సంజయ్ అనే వ్యక్తి పై ఈ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే, తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద రవితేజ తల్లి తో పాటు మర్రిపాకకు చెందిన సంజయ్ అనే వ్యక్తి ఎర్ర మట్టి కోసం తవ్వకాలు చేస్తుండగా పక్కనే ఉన్న పుష్కర కాలువ, స్లూయిజ్ నిర్మాణం ధ్వంసం అయింది. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు వారిద్దరి పై కేసు నమోదు చేశారు.
రామవరం వద్ద రవితేజ కుటుంబానికి చెందిన భూమిలో తాసిల్దార్ అనుమతి ఇవ్వకుండా మైనింగ్ కు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ విషయం పై రవితేజ నుండి ఎలాంటి స్పందన రాలేదు.