మాస్ మహారాజా రవితేజ నటించిన చివరి చిత్రం క్రాక్. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు రవి తేజ మరో సినిమా తో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఆ సినిమా పేరు ఖిలాడీ. ఈ చిత్రం నుంచి ఇటీవల టీజర్ రిలీజ్ అయ్యింది. ఆ టీజర్ సినిమా పై చాలా అంచనాలు పెంచేస్తుంది. డైరెక్టర్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వంవహించాడు. ఇంతకముందు రమేష్ వర్మ రాక్షసుడు అనే సినిమా తో సూపర్ హిట్ అందుకున్నాడు.
ఒక్క డైలాగ్ ఉన్న 80 సెకన్ల టీజర్‌లో రవితేజ తన యాక్షన్ ప్యాక్ నటనతో సూపర్ గా నటించాడు. టీజర్ లో చూసుంటే రవితేజ రెండు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నాడని అనిపిస్తుంది. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి, అర్జున్ మరియు అనసూయ భరద్వాజ్లతో సహా చాలా మంది ప్రముఖ యాక్టర్స్ కూడా ఈ టీజర్ కనిపించరు.
ఒక చిన్న అమ్మాయి పరారీలో ఉంది. ఆ అమ్మాయికి ఈ ప్రధాన కథకు బలమైన సంబంధం ఉండవచ్చు. రవితేజ ఒకరిని వెతుకుతున్న వేటలో ఉన్నందున టీజర్‌లో చాలా యాక్షన్ కనిపిస్తుంది. అనుమానాస్పదంగా, రవితేజ డింపుల్ హయాతిని చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది.
“If you play smart without stupid emotions, you are unstoppable,” అని రవితేజ గారు చెప్పిన డైలాగ్ తో టీజర్ ముగుస్తుంది. DSP ఈ సినిమా కు మ్యూజిక్ ను అందించాడు. ఈ సినిమా టీజర్ చూస్తుంటే DSP అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ఇచ్చినట్టు కనిపిస్తుంది.
దర్శకుడు రమేష్ వర్మకు మాస్ ఆడియన్స్‌తో పాటు క్లాస్ ఆడియన్స్‌ని ఎలా రప్పించాలో తెలుసు, టీజర్ చూస్తుంటే రవితేజకు మరో బ్లాక్ బస్టర్ ఖాయమని అనిపిస్తుంది. ఈ టీజర్ను ఉగాది సందర్బంగా చిత్ర యూనిట్ ప్రేషకుల ముందుకి తీసుకువచ్చింది.