మాస్ మహారాజా తన సినీ కెరీర్ లో అనేక విభిన్నమైన చిత్రాల్లో నటించారు. ఇటీవల ఆయన ‘క్రాక్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆయన సినీ కెరీర్ లో ఈ సినిమా అత్యధిక వసూళ్ల సాధించింది. ఈ సినిమా తరువాత ‘ఖిలాడి’ సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా తుదిదశకు చేరుకుంది. ఈ సినిమా సెట్స్ పైన ఉండగానే కొత్త దర్శకుడితో మరో సినిమాను చేస్తున్నట్లు రవితేజ ప్రకటించారు.

శరత్ మండవ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. రవితేజ కెరీర్లో ఈ సినిమా 68వ చిత్రంగా తెరకెక్కనుంది. ఈ సినిమాకు “రామారావు ఆన్ డ్యూటీ” అనే పేరును ఖరారు చేశారు. ఈ పోస్టర్ లో రవితేజ స్టైలీష్ లుక్ తో కనిపించారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకొని సెట్స్ పైకి వెళ్ళింది.

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ అనే బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సామ్ సీఎస్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజకు జోడిగా దివ్యాన్ష కౌశిక్ నటించనుంది.

 

x