రవితేజ సరి కొత్త సినిమా ‘నేను లోకల్’ సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కినతో, ఈ సినిమాను ఆదివారం అధికారికంగా ప్రకటించారు.
హీరో మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య తీసిన ‘క్రాక్’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చి అందరిని అలరించాడు. మాస్ మహారాజా రవితేజ ఇపుడు ‘ఖిలాడి’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తరువాత తీయబోయే సినిమాను కూడా ప్రకటించాడు.
రవితేజ తన తరువాత సినిమా ఎవరితో అంటే ‘సినిమా చూపిస్తా మావ’, ‘నేను లోకల్’ వంటి హిట్ చిత్రాలకు దర్శకుడు వ్యవహరించిన త్రినాథరావు నక్కినతో. ఈ సినిమాను మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతుంది. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రవితేజ కెరియర్ లో 68వ సినిమాగా తెరకెక్కబోతుంది.
ఈ సినిమాకు సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహారిస్తున్నాడు. కుమార్ బెజవాడ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
ప్రస్తుతం రవితేజ తీస్తున్న ‘ఖిలాడీ’ సినిమాకు రమేష్ వర్మ డైరెక్టరుగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ గారు, మలయాళ స్టార్ అయిన ఉన్ని ముకుందన్ కూడా యాక్ట్ చేస్తున్నారు. త్వరలో ఖిలాడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రవితేజ వస్తున్నాడు.
డైరెక్టర్ త్రినాథరావు నక్కిన, రవితేజతో తీయబోయే సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు అధికారకంగా వెల్లడిస్తారు.