ప్రభాస్ తన కెరీర్ లో బాహుబలి సినిమా కోసం ఐదు సంవత్సరాలను కేటాయించాడు. ఈ తరానికి చెందిన ఏ హీరో చేయలేని రిస్క్ ప్రభాస్ చేశాడు. చివరికి ఆయన కష్టానికి ఫలితం దక్కింది. బాహుబలి సినిమా తర్వాత, ప్రభాస్ ఒక పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.

ప్రస్తతం ప్రభాస్ వరుసగా సినిమాలు చెయ్యడం మొదలుపెట్టాడు. ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు లైన్ లో ఉన్నాయి. వాటిలో “రాధే శ్యామ్” సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సాలార్, ఆదిపురుష్ సినిమాలు షూటింగ్ దశలో ఉండగా, ప్రభాస్ నాగ్ అశ్విన్ తీయబోయే సినిమాను కూడా పట్టాలెక్కించాడు.

ప్రస్తుతం నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మూవీ మేకర్స్ తాత్కాలికంగా “ప్రాజెక్ట్ కె” అనే వర్కింగ్ టైటిల్ ను పెట్టారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ షూటింగ్ లో చిత్ర బృందం అమితాబచ్చన్ పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ ఈ సినిమా కోసం తన డేట్స్ ను 200 రోజులకు పైగా ఇచ్చినట్లు సమాచారం. బాహుబలి సినిమా తర్వాత, ప్రభాస్ ఈ సినిమాకు ఎక్కువ డేట్స్ ను కేటాయించాడు.

సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నిర్మాతలు భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు. ప్రభాస్ మొదట ఆదిపురుష్ మరియు సాలార్ సినిమాలను పూర్తి చేసిన తర్వాత ప్రాజెక్ట్ కె సినిమాకి వెళ్లనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తోంది. వైజయంతి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

x